ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధం : టీడీపీ

ABN, First Publish Date - 2020-03-12T07:42:03+05:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి బుద్ది చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మపాల/అనకాపల్లి రూరల్‌, మార్చి 11:  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి బుద్ది చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. బుధవారం  నామినేషన్లు స్వీకరణ కార్యక్రమానికి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి  నడిపల్లి గణేష్‌కు మద్దతుగా వచ్చిన పీలా విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చి తప్పు చేసినట్లుగా మరో తప్పు చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.  ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ చీకటి  ప్రభుత్వానికి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణంలో ఐదు కార్పొరేటర్లలను గెలిపించుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు.  అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు కూడా వైసీపీ రంగులు వేయడం అన్యాయమన్నారు.  వైసీపీ అధినేత జగన్‌ బీసీ, ఎస్‌సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఎస్‌సీ, ఎస్‌టీలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. రాజ్యసభ సీట్లను కోటేశ్వరులకు కట్టబెట్టే యోచనలో ఉన్న జగన్‌, ధనవంతుల పట్ల ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నారన్నారు. పంచకర్ల రమేష్‌బాబును బెదిరించి వైసీపీలోకి లాక్కున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణశాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, టీడీపీ నాయకులు చెక్కల శ్రీను, బాదపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T07:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising