ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమాలో చింతపల్లిదే అగ్రస్థానం

ABN, First Publish Date - 2020-12-16T05:01:58+05:30

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటల బీమా కింద జిల్లాలో అత్యధికంగా చింతపల్లి మండల రైతులు లబ్ధి పొందారు. జిల్లాలో 17 మండలాల పరిధిలో 2971 మంది రైతులకు చెందిన 1936.7 హెక్టార్ల పంటకు బీమా కింద రూ. 2.11 కోట్లు పరిహారం వచ్చింది.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నేతలు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

728 మంది రైతులకు రూ.1.47 కోట్లు మంజూరు


విశాఖపట్నం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటల బీమా కింద  జిల్లాలో అత్యధికంగా చింతపల్లి మండల రైతులు లబ్ధి పొందారు. జిల్లాలో 17 మండలాల పరిధిలో 2971 మంది రైతులకు చెందిన 1936.7 హెక్టార్ల పంటకు బీమా కింద రూ. 2.11 కోట్లు పరిహారం వచ్చింది.    వెఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంపై మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఈ వివరాలను వివరించారు. మొత్తం పరిహారంలో చింతపల్లి మండలంలో 728 మంది రైతులకు చెందిన 760 హెక్టార్ల పంటకు రూ.1,47,31,334 వచ్చింది. తరువాత ఎస్‌.రాయవరం మండలంలో 244 మందికి 124 హెక్టార్లకు రూ.15,42,545 పరిహారం వచ్చింది. జి.మాడుగులలో 406 మందికి 259 హెక్టార్లకు రూ.13,37,907, దేవరాపల్లి మండలంలో 555 మందికి 90 హెక్టార్లకు రూ.10,50,373,  నర్సీపట్నంలో 435 మందికి 205.5 హెక్టార్లకు రూ.6,20,002, కశింకోటలో 379 మందికి 195.3 హెక్టార్లకు రూ.2,46,653, హుకుంపేటలో 93 మందికి 160.2 హెక్టార్లకు రూ.3,66,301, పెదబయలులో 47 మందికి  160.2 హెక్టార్లకు రూ.4,96,487, అరకులో 42 మందికి 33 హెక్టార్లకు రూ.4,60,844, డుంబ్రిగూడలో 15 మందికి 21.7 హెక్టార్లకు రూ.3,12,458 పరిహారం వచ్చింది. అతి తక్కువగా  రావికమతంలో ఒక రైతుకు 0.1 హెక్టార్‌కు కేవలం రూ.151 మాత్రమే వచ్చింది. రోలుగుంటలో  ఒక రైతుకు చెందిన 0.7 హెక్టార్‌కు రూ.226, మాకవరపాలెంలో ఒక రైతుకు 0.2 హెక్టార్‌కు రూ.311, అచ్యుతాపురంలో ముగ్గురు రైతులకు 1.5 హెక్టార్లకు రూ.488, వి.మాడుగులలో నలుగురికి 13.5 హెక్టార్లలో నష్టానికి రూ.528లు, నాతవరంలో 15 మందికి 10.8 హెక్టార్లకు రూ.10,167, అనంతగిరిలో ఇద్దరికి 1.6 హెక్టార్లలో పంట నష్టానికి రూ.10,703 పరిహారం వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పర్యాటకశాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ బి.సత్యవతి, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, గుడివాడ అమర్‌నాథ్‌, తిప్పలనాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ పలువురు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T05:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising