ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28న నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ధర్నా

ABN, First Publish Date - 2020-12-27T04:48:55+05:30

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి, ప్రజలపై మోయలేని భారం మోపిందని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పార్టీలకు అతీతంగా అంతా విజయవంతం చేయాలి 

 వార్డు ఇన్‌చార్జిల సమావేశంలో అయ్యన్న

 నర్సీపట్నం, డిసెంబరు 26 : రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి, ప్రజలపై మోయలేని భారం మోపిందని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 28న మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. శనివారం పార్టీ వార్డు ఇన్‌చార్జిలతో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర సరుకులైన పప్పులు, బియ్యం తదితరాలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, ఇసుక, సిమెంటు, స్టీల్‌, మద్యం ధరలు, విద్యుత్‌ చార్జీలు పెంచేయడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. టీడీపీ హయాంలో, ప్రస్తుత ధరలను పేర్కొంటూ ఇప్పటికే వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ప్రజల అవస్థలు ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు సోమవారం చేపట్టనున్న ఆందోళనలో పార్టీలకు అతీతంగా అంతా పాల్గొనాల్సిందిగా కోరారు.  టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమం విజయంతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.  మాజీ కౌన్సిలర్లు రావాడ నాయుడు, పైల గోవింద్‌, దన్నిన రాంబాబు, గవిరెడ్డి వెంకటరమణ, ధనిమిరెడ్డి మధు, నాగేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising