ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరిలో పాముపొడ తెగులు

ABN, First Publish Date - 2020-11-04T05:08:40+05:30

అధిక వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురైన వరి పైరును పాముపొడ తెగులు ఆశించిందని, రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీ-కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బి.నాగేంద్రప్రసాద్‌ సూచించారు.

పాముపొడ తెగులు ఆశించిన వరి పైరును పరిశీలిస్తున్న సస్యరక్షణ శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్‌ సూచన

రాంబిల్లి, నవంబరు 3: అధిక వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురైన వరి  పైరును పాముపొడ తెగులు ఆశించిందని, రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీ-కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బి.నాగేంద్రప్రసాద్‌ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని కుమ్మరాపల్లి, రజాల, మామిడివాడ; ఎస్‌.రాయవరం మండలం వేమగిరి, వెలమపాలెం గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. అన్నిచోట్లా పాముపొడ తెగులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ తెగులు కారణంగా ధాన్యం దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతుందన్నారు. ఇప్పటికే ప్రొపికోనజోల్‌ లేద హెక్సాకోనజోల్‌ మందును పిచికారీ చేసి 20 రోజులు దాటితే.... మందును మార్చి మరోసారి పిచికారీ చేయాలని సూచించారు. కాగా టెబ్యుకోనజోల్‌ + అజాక్సి స్త్రోబిన్‌ మందు ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా టెబ్యుకొనజోల్‌ + ట్రైప్లాక్సి స్త్రోబిన్‌ మందు ఎకరానికి 160 గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలని, దీనివల్ల 20 నుంచి 30 రోజుల వరకు పాముపొడ, పొట్టకుళ్లు, మానిపండు, అగ్గితెగులు, గోధుమ మచ్చ వంటివి సోకవని ఆయన చెప్పారు. 


Updated Date - 2020-11-04T05:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising