ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూలో అత్యాధునిక ల్యాబ్‌

ABN, First Publish Date - 2020-12-15T06:30:09+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యాధునిక లేబొరేటరీ ఏర్పాటుకానుంది. ఇందుకోసం రూసా 2.0 నిధులు రూ.15 కోట్లు వెచ్చించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.15 కోట్లతో ఏర్పాటు

నీరు, ఆహారం, మందులు పరీక్షించేందుకు అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యాధునిక లేబొరేటరీ ఏర్పాటుకానుంది. ఇందుకోసం రూసా 2.0 నిధులు రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. ఈ లేబొరేటరీలో నీరు, ఆహారంతోపాటు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు తయారుచేసే పలురకాల మందులను పరీక్షించుకునేందుకు అత్యాధునిక పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. ల్యాబ్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌లు, అనలిస్ట్‌లతోపాటు ఇతర సిబ్బంది కలిపి పది మంది వరకు ఉంటారు. యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులతోపాటు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు పరిశోధనలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సిరిపురం కూడలికి దగ్గరలో ఈ లేబొరేటరీ కోసం స్థలం చూశారు. మరికొద్దిరోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేసే ఒక్కో పరికరం కోటిపైనే ఉంటుందంటున్నారు. ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే పరిశోధక విద్యార్థులకు, ముఖ్యంగా డ్రగ్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-15T06:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising