ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సార్వత్రిక సమ్మె

ABN, First Publish Date - 2020-11-26T06:15:14+05:30

కేంద్ర ప్రభుత్వం...కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తున్న వామపక్షాలు... అందుకు నిరసనగా గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరసన ప్రదర్శనలకు వామపక్షాల ఏర్పాట్లు

విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం...కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తున్న వామపక్షాలు... అందుకు నిరసనగా గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె నేపథ్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని దొండపర్తిలో గల డీఆర్‌ఎం వద్ద కార్యాలయం నుంచి జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వరకూ భారీ ప్రదర్శన జరుగుతుందని ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. బస్సులను నిలుపుదల చేసి సమ్మెకు మద్దతు తెలపాలని ప్రజా రవాణా శాఖ అధికారులను కోరామన్నారు. అలాగే సమ్మెలో భాగస్వాములు కావాలంటూ ఆటో యూని యన్‌లకు ఇప్పటికే సమాచారం పంపించామన్నారు. బ్యాంకులతో పాటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్యాలయాలను కూడా మూసివేయిస్తామని సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు తెలిపారు.

Updated Date - 2020-11-26T06:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising