ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏవోబీలో టెన్షన్ టెన్షన్

ABN, First Publish Date - 2020-12-14T14:19:45+05:30

విశాఖ ఏవోబీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోలు హతమార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  విశాఖ ఏవోబీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోలు హతమార్చారు. జి.మాడుగుల మండలం నుర్మతి  పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గత రాత్రి మావోయిస్టులు హతమార్చారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. 


మరోవైపు ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా స్వాభిమాన్‌ ఆంచల్‌ కటాఫ్‌ ఏరియా సింగారం అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్  కొనసాగుతోంది. క్యూటఫ్ ఏరియాలో  డీవీఎఫ్, ఎస్ వోజీ, బీఎస్ ఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. సింగారం ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో రెండు మృతదేహాలతో పాటు ఓ ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 4 మ్యాగ్ జైన్లు, 30 రౌండ్ల లైవ్ బుల్లెట్లు, 15 డిటోనేటర్లు, 3 కిట్ బ్యాగ్‌లు, కెమెరా ఫ్లాష్, వాకీటాకీని మల్కాన్ గిరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

Updated Date - 2020-12-14T14:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising