ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతామల బాటలో సిరివర

ABN, First Publish Date - 2020-09-13T19:11:22+05:30

తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు కోసం చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపాటు


సాలూరు(విజయనగరం): తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్న కొదమ పంచాయతీ సిరివర గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మించుకోవాలని తీర్మానం చేసుకున్నారు. చింతామల గ్రామస్థులను ఆదర్శంగా తీసుకుని వారి లాగే చందాలను పోగు చేస్తున్నారు. సిరివరతో పాటు డోయివర, తాటిపుటి, పోయివాడ, చిలకమెండంగి గ్రామాల గిరిజనులు శనివారం సిరివరలో గిరిజన నేతలు కృష్ణ, కుమార్‌, మాలతి తదితరుల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. తమ గ్రామాలకు రోడ్డు కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని అందరూ ముక్తకంఠంతో అనుకున్నారు.


సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందే అనే బాలింతను 2018 జూలై 30న ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 10 కిలోమీటర్లు డోలీతో మోసుకువెళ్లడం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి సైతం వెళ్లినా స్పందన లేకపోవడంపై వారంతా విచారం వ్యక్తం చేశారు. తమకు రోడ్డు వచ్చేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సహకరించాలని కోరారు. ఈ ఐదు గ్రామాల్లో 142 గిరిజన కుటుంబాలు ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున చందాలను పోగు చేస్తున్నారు. సిరివర నుంచి మక్కువ మండలం నంద వరకు రోడ్డు నిర్మిస్తే ఈ ఐదు గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. ఆ మేరకు రహదారి నిర్మాణం కోసం రూ.4,26,000తో చందాలు సేకరించి పనులు ప్రారంభిస్తామని గిరిజన నేత కృష్ణ తెలిపారు. ఇప్పటికే కొందరు చందా అందజేసినట్లు చెప్పారు.




Updated Date - 2020-09-13T19:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising