ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిఫారసులతో పనిలేదు.. అర్హతకే పెద్దపీట

ABN, First Publish Date - 2020-12-26T05:15:27+05:30

పథకాల మంజూరులో ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని సంగువారి మెట్ట సమీపంలో వేసిన లే అవుట్‌లో 475 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు.

ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి బొత్స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

చీపురుపల్లి, డిసెంబరు 25 : పథకాల మంజూరులో ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని సంగువారి మెట్ట సమీపంలో వేసిన లే అవుట్‌లో 475 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 1800 ఎకరాల్లో 114 లే అవుట్లు వేసి, లక్షా ఎనిమిది వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జేసీ కిషోర్‌కుమార్‌, ఆర్డీవో భవానీ శంకర్‌, ఎస్‌డీసీ సాల్మన్‌రాజు, డ్వామా పీడీ నాగేశ్వరావు, డీఈవో జి.నాగమణి, ఎంపీడీవో కె.రామకృష్ణరాజు, తహసీల్దార్‌ పీవీ శ్యామసుందరరావు, వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కాగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని సంబంధిత ఉద్యోగులు మంత్రి బొత్సకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-12-26T05:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising