ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి పథకం మహిళలకే

ABN, First Publish Date - 2020-12-27T05:33:36+05:30

ప్రభుత్వం అందించే ప్రతి పథకం మహిళల పేరుపైనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరి జన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

కొమరాడ, డిసెంబరు 26 : ప్రభుత్వం అందించే ప్రతి పథకం మహిళల పేరుపైనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరి జన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం కొమరాడ గ్రామంలో ఇంటి పట్టాలు, జగనన్న గృహ సముదాయాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమ లు చేస్తుందన్నారు. ఈ పథకాలన్నింటినీ మహిళలకు అంది స్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి రాని లబ్ధిదారులు ఉంటే సమీప గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎన్నికల సమయం లోనే మహిళలు గుర్తుకు వస్తారని విమర్శిం చారు. చంద్రబాబు వలే కాకుండా ఏ పథకా నికైనా మహిళలకు అందించడమే జగనన్న ఉద్దేశమన్నారు. రాష్ట్ర సంస్కృతిక అధ్యక్షురాలు వంగపండు ఉషా ‘ఏ పిల్లో వెళ్దమొస్తవా’ పాట పాడి సభకు వచ్చిన వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. తహసీల్దార్‌ ప్రసాద్‌, గృహ నిర్మాణశాఖ డీఈ నారాయణరావు, వ్యవసా యాధికారి శంకరరావు, వెలుగు ఏపీఎం వెంకట కిశోర్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో బాలకృష్ణ, వైసీపీ మండల అధ్యక్షుడు డి.జగనార్దనరావు, శెట్టి మధుసూదనరావు, సూరపునాయుడు, సింహాచలం, శరత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:33:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising