ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మకు ఆర్థిక భరోసా

ABN, First Publish Date - 2020-10-03T09:55:52+05:30

మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం(రూ.5వేల సాయం) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం సాయానికి రాష్ట్రం మరింత తోడ్పాటు

రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అందనున్న సాయం


బొబ్బిలి, అక్టోబరు 2:

మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం(రూ.5వేల సాయం) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద ఇదివరకూ ఇస్తున్న సాయాన్ని మరింతగా పెంచింది. సహజ కాన్పులకు రూ.ఐదువేలు, సిజేరియన్‌కు రూ.మూడువేలు అందించేందుకు వీలుగా జీవో విడుదల చేసింది. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో గర్భిణి రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ఆర్థిక సాయం పొందే వీలు కలిగింది.


గతంలో అనేక సాంకేతిక సమస్యలతో గర్భిణులకు అందించే సాయంలో చాలా జాప్యం జరిగేది. ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు ఈ మొత్తం జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయాన్ని విడతల వారీగా అందజేస్తున్నారు. గర్భిణిగా నిర్ధారణయ్యాక రూ.వెయ్యి, ఏడో నెలలో రూ. రెండువేలు, ప్రసవం తరువాత మూడో వారానికి మిగిలిన రూ.రెండువేల చొప్పున అందజేస్తున్నారు. పల్లెలు.. పట్టణాల్లో పేద గర్భిణులు నెలలు నిండిన తరువాత కూడా కాయకష్టం చేసుకునేందుకు వెళ్తుంటారు.


పౌష్టికాహారం లేక, విశ్రాంతి లేక కాన్పు సమయంలో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ఘటనలు అనేకం ఉన్నాయి. తీరా పుట్టిన బిడ్డలు సైతం నిర్ణీత బరువుకన్నా తక్కువగా ఉండడం చూస్తున్నాం. వీటిని పరిగణనలోకి తీసుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం పెంచుతున్నాయి. గర్భిణులకు అదనపు సాయానికి సంబంధించి జీవో విడుదలైనట్లు బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ జి.శశిభూషణరావు ధ్రువీకరించారు.

  

 సాయం పెరిగింది..జి.వెంకటరత్నం, డిస్ర్టిక్‌ పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌

గర్భిణులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేవారికి అదనపు లబ్ధి చేకూరుతుంది. జిల్లాలో నెలకు సగటున అన్ని ఆసుపత్రుల్లో 2500 నుంచి 3000 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో 1800 నుంచి 2000 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.       

Updated Date - 2020-10-03T09:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising