ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ టీపొడి

ABN, First Publish Date - 2020-02-12T12:00:15+05:30

గణపవరం కేంద్రంగా నకిలీ టీ పొడి తయారీ, విక్రయాలు సాగుతున్నాయి. రంగులు కలిపి స్థాని కంగా బ్రాండ్‌ ఏర్పాటుచేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం కేంద్రంగా తయారీ, విక్రయం

విజిలెన్స్‌ తనిఖీలో బట్టబయలు

360 కేజీల రంగు కలిపిన పొడి స్వాధీనం


గణపవరం, ఫిబ్రవరి 11:  గణపవరం కేంద్రంగా నకిలీ టీ పొడి తయారీ, విక్రయాలు సాగుతున్నాయి. రంగులు కలిపి స్థాని కంగా బ్రాండ్‌ ఏర్పాటుచేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న విజిలెన్స్‌ ఎన్స్‌పోర్‌మెంట్‌ అధికా రులు మంగళవారం తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్‌ సీఐ యూజె విల్సన్‌ నేతృత్వంలో అధికారులు గాది రాజు విశ్వనాఽథరాజు గృహంలో మంగళవారం విస్తృత తనిఖీ నిర్వహించారు. 


సీఐ యూజె విల్సన్‌ తెలిపిన వివరాల ప్రకారం విశ్వనాథరాజు ఇంటిపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. విశాఖపట్నం నుంచి టీ పొడి దిగుమతి చేసుకుని రంగులు కలిపి ‘సూపర్‌ గోల్డ్‌’ పేరిట టీ పొడి ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.


వంద గ్రాములు, 250 గ్రామాలు, 300 గ్రాముల వరకు ప్యాకెట్లు తయారు చేస్తున్నార న్నారు. రంగు కలిపిన 309 కిలోల టీ పొడి స్వాధీనం చేసుకున్నామన్నారు. రంగు కలిపిన, రంగు కలపని టీ పొడి నమూనాలు పరీక్షలకు పంపుతామన్నారు. నివేది క ఆదారంగా చర్యలు తీసుకొంటామని తెలిపారు. తనిఖీల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటరమణ, విజిలెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాధాకృష్ణ, కానిస్టేబుల్‌ వాసు, ఇన్‌ ఛార్జ్‌ వీఆర్వో మేరీ ఎమెరియా, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-02-12T12:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising