ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తాం

ABN, First Publish Date - 2020-03-02T11:44:26+05:30

చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు అంబటి మధుమోహనకృష్ణ అన్నారు.పాలకొల్లు మండలం ఉల్లంపర్రు ఏఎస్‌ఆర్‌ ఐటీఐ కళాశాలలో ఆది వా రం జరిగిన మండలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు అంబటి 

పాలకొల్లు రూరల్‌, మార్చి 1 : చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు అంబటి మధుమోహనకృష్ణ అన్నారు.పాలకొల్లు మండలం ఉల్లంపర్రు ఏఎస్‌ఆర్‌ ఐటీఐ కళాశాలలో ఆది వా రం జరిగిన మండలి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సముద్ర తీరంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్‌లకు అనుకూలంగా ఉంటాయని అన్నారు. తీర ప్రాంతాల్లో షూటింగ్‌ల వల్ల ఖర్చు తగ్గడంతోపాటు ప్రకృతి అందాలను ప్రోత్సహించినట్టు ఉంటుందని దర్శక నిర్మాతలకు సూచనలిస్తున్నట్టు చెప్పారు. చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.


ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా పేరుగాంచిన దర్శకులు, నిర్మాతలే కాకుండా నటీనటులు, ఇతర విభాగాల్లో పనిచేసేవారు ఉన్నారన్నారు.బాలీవుడ్‌ నటి షేక్‌ షఫా, మండలి ఉపాధ్యక్షుడు పి.విజయవర్మ, కార్యదర్శి జెవి.మోహన్‌గౌడ్‌, కోశాధికారి పాలెపు రామారావు, కార్యవర్గ సభ్యులు జనగా చైతన్య, వడ్డే రామానుజం, బోడపాటి మురళి, కె.మల్లిఖార్జునయాదవ్‌, కొలగట్ల ప్రతాప్‌, ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ, స్థానికులు సుబ్బరాజు, మద్దాల వాసు, రావాడ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T11:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising