ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ధర్నా

ABN, First Publish Date - 2020-12-15T05:36:18+05:30

వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభం లోకి నెట్టే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రజలందరిపైన భారాలు మోపే విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరు తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖ రికి నిరసనగా సోమవారం ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.

ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 14 : వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభం లోకి నెట్టే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రజలందరిపైన భారాలు మోపే విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరు తూ  ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖ రికి నిరసనగా సోమవారం ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, సీపీ ఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ 19 రోజులుగా రైతులు ఢిల్లీలో చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దేశంలోని రైతులందరినీ అవమాన పర్చడమేనన్నారు. ఇప్ప టికైనా కేంద్రం రైతు సంఘాల నాయకులతో చర్చ లు జరిపి హాని చేసే వ్యవసాయ చట్టాల రద్దుకు అంగీకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, కాం గ్రెస్‌ ఏలూరు నగర అధ్యక్షుడు రాజనాల రామ్మో హన్‌రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీని వాస్‌, సీపీఎం నాయకులు పి.కిషోర్‌, డీఎన్‌వీడీ ప్రసాద్‌, బి.జగన్నాథం, వి.సాయిబాబా, శ్యామల రాణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రవి, న్యూడెమోక్రసి నాయ కులు కాకర్ల అప్పారావు, జి.రాంబాబు, మంగం అప్పారావు, శ్రీను పాల్గొన్నారు.


నేటి నుంచి కిసాన్‌ జ్యోతి ర్యాలీలు

కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా మంగళవారం అన్ని గ్రామాల్లో కిసాన్‌ జ్యోతి ర్యాలీ లు నిర్వహిస్తున్నట్టు ఏపీ రైతు సంఘాల పోరాట కన్వీనర్‌ కమిటీ నాయకుడు కె.శ్రీనివాస్‌ తెలిపారు. పవరుపేటలోని అన్నేభవనం వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈనెల 21న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు, దశల వారీగా ఆందోళనలు ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి. రామకృష్ణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు పాల్గొన్నారు.


 బీసీ సంక్షేమ సంఘం మద్దతు

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 14 : ఢిల్లీలో రైతు లు చేస్తున్న పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన నిర్వహించి అనంతరం డీఆర్వో శ్రీనివాసరావుకు వి నతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీవిశ్వేశ్వర రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు పండించిన ధాన్యానికి, ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ లేకుండా ధరలు చట్టబద్ధం చేయ కుండా ప్రవేశ పెట్టిన చట్టం రైతుల పాలిట ఉరితాళ్ళేనన్నారు. కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుందన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టం కార్పొరేట్‌ శక్తులకు రైతాంగాన్ని బలివ్వడమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు మారగాని చంద్రకిరణ్‌, తాడేపలి ్లగూడెం అధ్యక్షుడు కేశవభట్ల విజయ్‌, మలిపూడి రాజు, బీవీ రమణ, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T05:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising