భారత్‌కు హార్లే డేవిడ్‌సన్ గుడ్‌బై
ABN, First Publish Date - 2020-09-25T06:28:31+05:30
అమెరికా లగ్జరీ బైక్స్ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్.. భారత్‌కు గుడ్‌బై చెప్పింది...
న్యూఢిల్లీ : అమెరికా లగ్జరీ బైక్స్ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్.. భారత్‌కు గుడ్‌బై చెప్పింది. భారత్‌లో అమ్మకాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. 2009లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన హార్లే ఇక్కడ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు స్థానికంగా భాగస్వా మ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2020 రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీ్‌సలో భాగంగా సిబ్బందిని తగ్గించుకోవటం, ఇతర దేశాల్లో ఉన్న వ్యాపారాలను కుదించుకోవటం వంటి నిర్ణయాలను కంపెనీ అమలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి హరియాణాలోని బావల్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది.
Updated Date - 2020-09-25T06:28:31+05:30 IST