ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే... ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియ... కారణమిదే...

ABN, First Publish Date - 2020-10-28T02:26:34+05:30

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) మెగా ఐపీవో వచ్చే ఏడాదికి వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన విలువను లెక్కగట్టడంపై ప్రభుత్వం మొదట దృష్టి సారించిందని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) సెక్రటరీ తుహిన్ కాంతాపాండే వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) మెగా ఐపీవో వచ్చే ఏడాదికి వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన విలువను లెక్కగట్టడంపై ప్రభుత్వం మొదట దృష్టి సారించిందని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) సెక్రటరీ తుహిన్ కాంతాపాండే వెల్లడించారు.


ఎల్ఐసీ ఇష్యూకు ముందు నాలుగు దశల్లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉందని, అవి నిబంధనలను పాటించడం కోసం సలహాదారుల  నియామకం, చట్ట సవరణ, ఎల్ఐసీ అంతర్గత సాఫ్ట్‌వేర్ లో మార్పులు, ఎల్ఐసీ వ్యాల్యూ ఎస్టిమేషన్‌కు అధికారి నియామకం దశలుంటాయి. ఇప్పటికే డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్‌ను సలహాదారులుగా నియమించారు.


చట్టంలో సవరణలు చేయడం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం  వాటా విక్రయానికి సిద్ధమవుతోంది. ఈ నాలుగు దశల తర్వాత ఎంత వాటా విక్రయించాలన్న విషయమై  నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ మొత్తం ప్రక్రియకు బాగా సమయం పట్టే అవకాశాలున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కానీ సాధ్యపడకపోవచ్చునని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-28T02:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising