ఎన్‌ఎ్‌సఈ అకాడమీ చేతికి ‘టాలెంట్ స్ర్పింట్’
ABN, First Publish Date - 2020-11-18T05:59:22+05:30
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) అనుబంధ సంస్థ ఎన్‌ఎ్‌సఈ అకాడమీ.. టెక్ ఎడ్యుకేషన్ కంపెనీ ‘టాలెంట్ స్ర్పింట్’ ఈక్విటీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది...
హైదరాబాద్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) అనుబంధ సంస్థ ఎన్‌ఎ్‌సఈ అకాడమీ.. టెక్ ఎడ్యుకేషన్ కంపెనీ ‘టాలెంట్ స్ర్పింట్’ ఈక్విటీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘టాలెంట్ స్ర్పింట్’’ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. దేశ, విదేశీ విద్యా, సాంకేతిక సంస్థలతో కలిసి ‘టాలెంట్ స్ర్పింట్’’ అందించే ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించి తాను అందించే సంప్రదాయ కోర్సులకు ‘టాలెంట్ స్ర్పింట్’’ టెక్నాలజీని జోడించాలని ఎన్‌ఎన్‌ఈ భావిస్తోంది.
Updated Date - 2020-11-18T05:59:22+05:30 IST