ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగులో తమిళ అక్షరాలా?

ABN, First Publish Date - 2020-05-07T05:59:58+05:30

అన్ని భాషల లిపుల అక్షరాలకు కంప్యూటర్, ఇతర ఉపకరణాలలో కోడ్‌లను అందించే అంతర్జాతీయ సంస్థ యూనికోడ్ కన్సార్షియం వారు ఏప్రిల్ 30న ఒక కబురును ట్విట్టర్‌లో పంచుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్ని భాషల లిపుల అక్షరాలకు కంప్యూటర్, ఇతర ఉపకరణాలలో కోడ్‌లను అందించే అంతర్జాతీయ సంస్థ యూనికోడ్ కన్సార్షియం వారు ఏప్రిల్ 30న ఒక కబురును ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాని సారాంశం ఏమిటంటే- తమిళ భాషలోని రెండు అక్షరాలను తెలుగులో విరివిగా వాడుతున్నందున వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వారు ఆమోదిస్తున్నారు. ఈ ప్రకటన వలన తెలుగు యూనికోడ్‌లో, తెలుగువారికి తెలీకుండానే, తెలుగువారి ఆమోదం లేకుండానే, రెండు తమిళ అక్షరాలు వచ్చి చేరుతున్నాయి. తమిళంలోని (పైన చూపిన) రెండు అక్షరాలను తెలుగు యూనికోడ్‌లో చేరుస్తూ యూనికోడ్ కన్సార్షియం నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ఏప్రిల్ 14నాడు వినోద్ రాజన్ అనే తమిళ వ్యక్తి సూచించాడు. పై రెండు తమిళ అక్షరాలను అదే రూపంలో (తెలుగు సమాన అక్షరాలుగా కాకుండా) యథాతథంగా వైష్ణవ మత గ్రంథాలలోను, ముఖ్యంగా తిరుప్పావై, తిరువాయిమొళిలలో విరివిగా తెలుగువారు వాడుతున్నారని ఒక పది పన్నెండు పాత పుస్తకాలను ఆధారంగా చేసుకుని అతను యూనికోడ్ వారికి ప్రతిపాదించడం, యూనికోడ్ వారు దీనిపై పెద్ద చర్చ లేకుండానే ఆమోదించడం జరిగిపోయింది. దీనివలన తెలుగుకు జరిగే చేటు అంతా యింతా కాదు. రేపు ఎవరైనా వ్యక్తి వచ్చేసి నా దగ్గర ముద్రిత పుస్తకాల ఆధారం ఉంది అని ఏవో పరాయి అక్షరాలను తెచ్చి సునాయాసంగా తెలుగు యూనికోడ్‌లో కలపవచ్చు. ఇది నిరసించాల్సిన విషయం. దీన్ని మనమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.

సామల రమేష్ బాబు, తెలుగు భాషోద్యమ సమాఖ్య

Updated Date - 2020-05-07T05:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising