ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహితీ ప్రియంభావుకుడు

ABN, First Publish Date - 2020-08-18T07:13:54+05:30

పెళ్లుమని శబ్దం వినిపించదు. చప్పుడు చేయని పాదముద్రలు. అతి సుతారపు సన్నని జీర గొంతు. వాత్సల్యం ప్రతిబింబించే చూపులు. మెరుస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లుమని శబ్దం వినిపించదు. చప్పుడు చేయని పాదముద్రలు. అతి సుతారపు సన్నని జీర గొంతు. వాత్సల్యం ప్రతిబింబించే చూపులు. మెరుస్తున్న కళ్లలోంచి మొలకెత్తే పఠన పరిశోధనా దృక్కులు. ఎంతవారలెదురైనా ఒదిగిపోయే మనస్తత్వం. నిష్కల్మషంగా, నిజాయితీగా, నిరలంకారంగా సానుకూల దృక్పథంతో స్పందించే గుణం. మర్యాద, మన్నన కలబోసిన మేరు పర్వతం. సహృదయత, వినమ్రత, ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన సాకార రూపమైన రాపాక ఏకాంబరాచార్యులు, సతీమణి రుక్మిణి ఇద్దరూ ఒకరోజు తేడాతో అకాల కరోనా బారినపడి తుదిశ్వాస విడవడం శోచనీయం.


ఎన్నడూ పెళుసు మాట పలికింది లేదు. ఎవర్నీ తూలనాడింది లేదు. ఎట్లాంటి సందర్భంలోనూ పరుషంగా ఆగ్రహ ప్రదర్శన చేసిందీ లేదు. ఏ వ్యక్తినీ పరోక్షంగా కసిరిందీ లేదు. పెద్ద కోరికలు, గుర్తింపు సమస్యలు లేవు. గుంపులోకి చొచ్చుకెళ్ళాలనే ఉబలాటం, వెంపర్లాటలు లేవు. ఇదీ అచ్చమైన పద్యప్రియుడైన రాపాక ఏకాంబరాచార్యులు స్వభావం. ఒడి నిండా మానవీయ పరిమళం. వాచాలత లేని ఆచరణాత్మక ఉదారత్వం. ప్రణాళికాబద్ధ జీవనగమనం. చిన్న మాటకు అమితంగా సంతృప్తిపడే అల్ప సంతోషి. సాధ్యమైనంత రీతిలో ఇతరులకు మేలు చేద్దామనే నిబద్ధుడు. ఇదీ రాపాక ఏకాంబరాచార్యులు మూర్తిమత్వం. 


ఛేదిద్దామనుకున్న లక్ష్యాలున్నాయి. అంకితభావంతో నెరవేరుద్దామనే ఆలోచనలున్నాయి. నన్నయ నుంచి నేటి దాకా వేయి పేజీల పద్య సౌరభం వెలయించే సంకల్పం తీరనేలేదు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వందమంది అవధానుల పరిచయాలు తర్వాత కాలంలో ‘అవధాన సర్వస్వం’ అనే వేయి పేజీల బృహద్గ్రంథం అయ్యింది. చిరస్థాయిగా నిలిచే రిఫరెన్సు పుస్తకమయింది. సామాజికవర్గం అభ్యర్థన మేరకు విశేష కృషి చేసి రాసిన 700 పేజీల ‘విశ్వబ్రాహ్మణ సర్వస్వం’ ఇంటింట దాచుకునే గ్రంథమైంది.


మా కోలంక గ్రామ హైస్కూలు పూర్వ విద్యార్థి. ఆయన ఒకానొక ప్రాంతీయ అభిమానంతో అక్కున చేర్చుకుని ప్రోత్సహించే స్నేహశీలి అయినందున ఈ రెండు మాటలు రాశాను. తన స్వగృహంలో ఇష్టంగా సేకరించిన 15 వేల అపురూప గ్రంథాల్నీ, ఆప్తుల్నీ, శిష్యుల్నీ విడిచిపెట్టి ఆగస్టు 15వ తేదీన భార్య రుక్మిణి, 16వ తేదీన ఏకాంబరాచార్యులు తనువు చాలించడం విషాదకరం. వారి కుటుంబానికి నివాళి.

దాట్ల దేవదానం రాజు

Updated Date - 2020-08-18T07:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising