ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాయిముంతల్ని మాయంజేసే...

ABN, First Publish Date - 2020-02-03T19:09:07+05:30

బౌద్ధాన్ని కత్తికో కండగా ఖతం జేసిన ఆదిశంకరుని కనుపాప పంకజాలు పునాదుల్లేని పురుష సూక్తాల పుట్కలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌద్ధాన్ని కత్తికో కండగా ఖతం జేసిన

ఆదిశంకరుని కనుపాప పంకజాలు

పునాదుల్లేని పురుష సూక్తాల పుట్కలు

మనువు తనువుతో హిందూ చిందులు

హరప్పా నాగరికతల నడుములిరిసిన ఆగంతకాల్లో

మా ముసలవ్వల కోటలు పలిగిన కుండ పెంకలు

యిచ్చుకపోయిన యిటికె కచ్చులు చెప్పే నిజ నివాస చరితలు

భూమి కన్న ఆర్నెల్లు ముందు బుట్టిన ఆదిజాంబవముని కుదుల్లము

జంబుద్వీపానికి మొదుల్లము

మా దేశమ్మీన బడి మమ్ముల దోప్కమ్‌ జేసి దోషుల్ని జేస్తున్నయి

మా యింట్ల జొచ్చి మమ్ముల్నే దొంగలని,

 మా బత్కుల్ని సింగాబంగం జేస్తున్నయి.

చరిత్ర కడుపు చించితే... యెంట్లు గట్టిన యెతలు

నేలమ్మ కాళ్ల గజ్జెలై కతలు జెప్తయి

విద్యల నైవేద్యాలు అగ్రహారాల్లో ఆనకట్టలేసుకున్నా...

సదువు సినుకు మా గూడెం సెవిగోడ మీద

మా అడివాకు మీద మెరిసిందనీ

మా నాలికె నలుసక్షరం తునుక నమిలిందనీ

వేయి వక్కలైన వేల్లు, సీసం దిమ్మీసలైన సెవులు

నరాలు చీలిన నాలికెలు - యింకా నడికట్టేసి నడూల్లె నిలవల్లే...

రాత రచ్చబండ కాడ నొసలు మాసిన నోటి రాతలు

మా నెత్తురు, చెమటను విత్తుకున్న యీ నేలమ్మ సముద్రాల్ని సదురుకొని

అడవుల్ని ఆవలించి పచ్చలుగా పసిద్దయింది.

యీ మట్టి మాకు బొడ్డూడని బిడ్డపేగు

మనిషితనం లేని మనుధర్మ కర్మలు

మమ్ముల్ని పురుగులకన్నా పుచ్చిన కుక్కలకన్నా

హీనంజేసి, మూతికి ముంత ముడ్డికి తాటాకులుగట్టి

వూరు అంచులకు అడివి పంచలకు తరిమి సంపుతుంటే...

బౌద్ధంల బచాయించిన బుద్ధిస్టులము

అలయ్‌ బలయ్‌ ఆలింగనాల్తో ముసల్మానులమైన మూలవాసులము

అక్కున జేర్చుకున్న ‘ఆమెన్‌’ల క్రీస్తుబిడ్డలము

మమ్ముల సంకనెత్తుకున్న సబ్బండ మతాలకు సంతకాలైనము

ఆకాశం అన్నం గిన్నెల అక్షరాల సుక్కల మెతుకుల్ని అతికించిన

సదువుల సందమామ సావిత్రిబాయి పూలే సంతతిమి

ఆకాశానికడ్డు బూమికి బొడ్డులేని

పురాణాల పుట్టల తవ్విన అండేద్కర్‌ ఆనవాల్లము

వేయి తలల కాళ్లజెర్రిని వేటాడిన కోరెగాములము

కోపెన కారటి దాపులు, ఆదార్కాడు అంచులు

ఓటరు కాయితమ్‌ ఒడిల బడని సదువుల్లేని

పంచార కంచాలము

తారీఖుల తలాపులు, దస్తావేజుల దరిదెల్వని

జోలె సంచులము, యిండ్లు పొండ్లు లేని యిలవరసలము

యీ పూట యీ పల్లె, రేపే పల్లెల తెల్లార్తదో

నిలకడలేని నీడలు

బతికిసెడ్డ సెరితల్ని నడుమున ముడేసుకొని నడిసే

నది గర్బాల నాడిని పట్టిసూడు

అలల కురుల్ని దువ్వి ముడిసే తీర్పాటంలేని

సముద్రుని తీరాలను ఆరాదియ్యి

పచ్చల అచ్చుల్ని కోకేసుకున్న

ఆకమ్మను అడిగి సూడు

కొండోని యెన్ను మీద యెదకొచ్చి ఎగిరిదునికే

ఏటి మాటల మూటిప్పు

గీ మట్టిని తట్టి సూత్తేసాలు...

నేలమ్మ కాళ్లమీద బడ్డ మురికి మూలాల్ని మొలేసి

పొరల్ని పొక్కిలిచ్చి తెరల పటం గడ్తది

మన్నుమడ్తల్ల వేళ్లూనుకున్న వేల చరితల

మాయిముంతల్ని శిబిరాల ఖబ్రస్థాన్‌ల ఖైదుజేసే

కా (CAA) ఎన్సార్సీలను మన్నార్సీ జేసే

వూరేగింపులు వురికొస్తున్నయి


జూపాక సుభద్ర

94410 91305

Updated Date - 2020-02-03T19:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising