ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్వీనర్‌ కోటా సీటు 4.32 లక్షలే!

ABN, First Publish Date - 2020-05-30T16:58:08+05:30

మెడికల్‌, డెంటల్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ఏడాదితో పొల్చితే అన్ని కేటగిరిల్లో 70% వరకు ఫీజుల్లో కోత విధించింది. మెడికల్‌లో కన్వీనర్‌ కోటా ఫీజు రూ.6.90 లక్షల నుంచి రూ.4.32 లక్షకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీ-కేటగిరీ ఫీజు 8.64 లక్షలు

మెడికల్‌, డెంటల్‌ ఫీజుల తగ్గింపు

70% వరకు తగ్గిస్తూ ఆరోగ్యశాఖ జీవో

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మెడికల్‌, డెంటల్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ఏడాదితో పొల్చితే అన్ని కేటగిరిల్లో 70% వరకు ఫీజుల్లో కోత విధించింది. మెడికల్‌లో కన్వీనర్‌ కోటా ఫీజు రూ.6.90 లక్షల నుంచి రూ.4.32 లక్షకు తగ్గించారు. అదేవిధంగా గత ఏడాది రూ.24 లక్షలున్న యాజమాన్య కోటా ఫీజును రూ.8.64 లక్షలకు కుదించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


కొత్తగా నిర్ణయించిన ఫీజులు 2020-21, 2022-23 వరకు అమల్లో ఉంటాయి. ఈ ఫీజుల్లోనే ట్యూషన్‌, అడ్మిషన్‌, స్పెషల్‌, లేబొరేటరీ, కంప్యూటర్‌, ఇంటర్నేట్‌ ఫీజులు ఉంటాయి. ఆయా ఫీజులను మెడికల్‌ కాలేజీలు విద్యార్థుల దగ్గర నుంచి రెండు విడతల్లో కట్టించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫీజులు కాకుండా విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా మెడికల్‌ కాలేజీలకు భారీ జరిమానా విధిస్తామన్నారు.

Updated Date - 2020-05-30T16:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising