ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 స్కూళ్లకు నోటీసులు ఇచ్చాం

ABN, First Publish Date - 2020-11-06T16:11:54+05:30

లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన 11 స్కూళ్లకు నోటీసులు జారీ చేశామని కోర్టుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌ తరగతులపై కోర్టుకు పాఠశాల విద్యాశాఖ


హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన 11 స్కూళ్లకు నోటీసులు జారీ చేశామని కోర్టుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీ దేవసేన తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థల కట్టడి కోరుతూ దాఖలైన బ్యాచ్‌ పిటిషన్‌లో ఆయన గురువారం ఈ మేరకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదులు వచ్చిన స్కూళ్లను అధికారులు తనిఖీ చేశారన్నారు.


సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ సిలబ్‌సలు బోధిస్తున్న 11 స్కూళ్లను గుర్తించామన్నారు. ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లా మణికొండలోని మౌంట్‌ లిటెరా జీ స్కూల్‌, బంజారాహిల్స్‌లోని మెరిడియన్‌ స్కూల్‌, హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌, అమీర్‌పేటలోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌, డీడీ కాలనీలోని నారాయణ హైస్కూల్‌, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, గీతాంజలి పబ్లిక్‌ స్కూల్‌, లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్‌, కల్పా స్కూల్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌లోని సెయింట్‌ అండ్రూస్‌ హైస్కూల్‌ ఉన్నాయి. ఆయా పాఠశాలలకు షోకాజ్‌లు జారీ చేశామని, వివరణ తీసుకున్నాక చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. 


Updated Date - 2020-11-06T16:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising