ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లావు తగ్గడమే పరిష్కారమా?

ABN, First Publish Date - 2020-08-18T18:10:15+05:30

డాక్టర్‌! నా వయసు 30. నాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(18-08-2020)

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 30. నాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే పరీక్షలో నాకు స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గిందని తేలింది. గత రెండేళ్లలో థైరాయిడ్‌ హార్మోన్‌ సమస్య వల్ల విపరీతంగా బరువు పెరిగాను. స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి నా అధిక బరువే కారణమా? పిల్లల కోసం ఐ.వి.ఎ్‌ఫను ఆశ్రయించక తప్పదా?


- ఓ సోదరుడు, హైదరాబాద్‌.


డాక్టర్ సమాధానం: స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి అధిక బరువు పరోక్షంగా కారణం అవుతుంది. అధిక బరువు కారణంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గి, ఈస్ట్రోడైల్‌ హార్మోన్‌ స్థాయి పెరిగితే స్పెర్మ్‌కౌంట్‌ తగ్గుతుంది. అలాగే అధిక బరువు కారణంగా తొడల మధ్య ఒరిపిడితో వేడి పుట్టి, ఆ ప్రభావంతో వృషణాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇలా వృషణాలు దెబ్బతింటే ఫాలిక్యులర్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ స్థాయి పెరిగి వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి అసలు కారణాన్ని హార్మోన్‌ పరీక్షతో కనిపెట్టాలి. ఈ పరీక్షతో పురుష హార్మోన్‌ స్థాయితో పాటు ఫాలిక్యులర్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ స్థాయి కూడా తెలుస్తుంది.


అధిక బరువు కారణంగా చోటుచేసుకున్న హార్మోన్‌ అవకతవకలను మందులతో సరిదిద్దవచ్చు. బరువు తగ్గడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఫలితంగా స్పెర్మ్‌కౌంట్‌ పెరిగి, పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి. అయితే వృషణాల సామర్థ్యం తగ్గితే తిరిగి సరిదిద్దే వీలు లేదు. ఈ పరిస్థితిలో బరువు తగ్గినా స్పెర్మ్‌కౌంట్‌ పెరగదు. కాబట్టి వైద్యుల సూచనమేరకు ఐ.వి.ఎఫ్‌ ద్వారా పిల్లలను కనే మార్గాన్నే ఆశ్రయించాలి. ఏది ఏమైనప్పటికీ హార్మోన్‌ పరీక్ష ద్వారా అసలు సమస్య తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. అధిక బరువు ప్రభావం శరీరంలోని అన్ని ప్రధాన అవయవాల మీదా  ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)



Updated Date - 2020-08-18T18:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising