నాకు చావే శరణ్యమా?
ABN, First Publish Date - 2020-02-11T16:40:18+05:30
డాక్టర్! నాకు పెళ్లయి మూడేళ్లు. తొలి రాత్రి తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాను. దాంతో ఆత్మస్థయిర్యం దెబ్బతింది. వైద్యుల సూచన మేరకు వయాగ్రా వాడినా ఫలితం దక్కలేదు. కలిసే ప్రయత్నం చేసిన ప్రతిసారీ అలాగే జరుగుతూ ఉండడంతో భార్యకు దూరంగా ఉండిపోయాను. హస్తప్రయోగం
ఆంధ్రజ్యోతి(11-02-2020)
ప్రశ్న: డాక్టర్! నాకు పెళ్లయి మూడేళ్లు. తొలి రాత్రి తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాను. దాంతో ఆత్మస్థయిర్యం దెబ్బతింది. వైద్యుల సూచన మేరకు వయాగ్రా వాడినా ఫలితం దక్కలేదు. కలిసే ప్రయత్నం చేసిన ప్రతిసారీ అలాగే జరుగుతూ ఉండడంతో భార్యకు దూరంగా ఉండిపోయాను. హస్తప్రయోగం సమయంలో అంగస్తంభనలు, స్ఖలనాలు మామూలుగానే జరుగుతున్నాయి. అయినా భార్యతో కలిసే సమయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ సమస్యతో బంధువుల్లో చులకన అయిపోయాను. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపిస్తోంది. నన్ను ఏం చేయమంటారు?
- ఓ సోదరుడు, దోర్నాల
జవాబు: మీకు అంగస్తంభనాలు, స్ఖలనాలు మామూలుగానే ఉన్నాయి. కాబట్టి సమస్య మీ మనసులోనే ఉంది. మొదటిసారి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ భయం మీ మనసులో అలా నాటుకుపోయింది. దాంతో భార్యతో కలిసే సమయానికి అంగం స్తంభించడం లేదు. ఇలాంటప్పుడు వయాగ్రా కూడా పని చేయదు. నిజానికి మీకు ఉన్నది సమస్యే కాదు. మీ మనసులో భయం పోయి, సమర్ధంగా సెక్స్‌లో పాల్గొనేలా చేయాలంటే అంగ స్తంభన ఎక్కువ సమయం పాటు నిలిపి ఉంచే చికిత్స అవసరం. ఇందుకోసం ‘ఇంట్రా పినైల్ ఇంజెక్షన్’ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అంగానికి చేస్తారు. దీంతో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు అంగం స్తంభించి ఉంటుంది. ఇలా ఒకసారి భార్యతో సెక్స్‌లో పాల్గొనగలిగితే, మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, తర్వాత ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. అయితే ఆ సమయంలో భార్య తోడ్పాటు కూడా అవసరం అవుతుంది. కాబట్టి మీరు భార్యతో కలిసి వైద్యులను సంప్రతించండి. ఈ ఇంజెక్షన్ పగటి వేళ తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఆస్పత్రికి దగ్గర్లో, వైద్యులకు అందుబాటులో ఉండాలి. కాబట్టి అనుభవజ్ఞులైన వైద్యులను కలిసి సమస్యను వివరించి, చికిత్స తీసుకోండి. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య ఆలోచన చేయడం అవివేకం.
- డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్
8332850090 (కన్సల్టేషన్ కోసం)
Updated Date - 2020-02-11T16:40:18+05:30 IST