వర్కవుట్ ఫ్రమ్ హోమ్
ABN, First Publish Date - 2020-04-08T16:27:35+05:30
ఇప్పుడంతా లాక్‌డౌన్. బయటకు వెళ్లే పని లేకపోవడంతో కనీసం వ్యాయామం కూడా లేకుండా పోతోంది. రోజూ ఏ జిమ్‌కో... పార్క్‌కో వెళ్లేవారు సైతం ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. అయితే ఇంట్లోనే ఉంటూ... సులువుగా చేసుకొనే
ఇప్పుడంతా లాక్‌డౌన్. బయటకు వెళ్లే పని లేకపోవడంతో కనీసం వ్యాయామం కూడా లేకుండా పోతోంది. రోజూ ఏ జిమ్‌కో... పార్క్‌కో వెళ్లేవారు సైతం ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. అయితే ఇంట్లోనే ఉంటూ... సులువుగా చేసుకొనే కొన్ని వర్కవుట్స్‌ను ఫిట్‌నెస్ ట్రైనర్లు సూచిస్తున్నారు. వాటిని మీరూ ఫాలో అయితే గుమ్మం దాటకుండా ఫిట్‌గా ఉండవచ్చు.
సూపర్‌మ్యాన్: బొక్కబోర్లా పడుకొని, చేతులను చాచండి. ఇప్పుడు కుడి చెయ్యి, తల, ఎడమ కాలు పైకి ఎత్తి, ఐదు సెకన్ల వరకు ఉంచండి. తరువాత ఇదే తరహాలో ఎడమ చెయ్యి, తల, కుడి కాలు పైకి ఎత్తండి. అలా పదిసార్లు చేయాలి.
బ్రిడ్జ్‌లా: వెల్లకిలా పడుకొని... చేతులను పూర్తిగా ఫ్లోర్‌కు ఆనేట్టు చాచండి. ఇప్పుడు కాళ్లను 90 డిగ్రీల కోణంలో మడిచి, పాదాలు మొత్తం నేలకు ఆనేలా ఉంచి, తొడలు, నడుము పై భాగాన్ని ఈ చిత్రంలో చూపినట్టు పైకి లేపండి. తరువాత సాధారణ పొజిషన్‌కు వచ్చేసి, మళ్లీ ఇదే విధంగా చేయండి. అలా ఐదు నుంచి పది సెకన్ల పాటు ఉండేలా పది సార్లు చేయండి.
మెట్రోనోమ్‌లా: వెల్లకిలా పడుకొని, భుజాలకు సమాంతరంగా చేతులను పక్కకు చాచండి. 90 డిగ్రీల కోణంలో కాళ్లను మడిచి, కుడి వైపునకు నేల తగిలేలా వంచడానికి ప్రయత్నించండి. తరువాత రెండో పక్కకు వంచండి. ఇలా పదిసార్లు చేయాలి.
Updated Date - 2020-04-08T16:27:35+05:30 IST