వ్యాయామం ఎంతసేపు?
ABN, First Publish Date - 2020-12-15T18:57:49+05:30
ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. అయితే అధిక కొవ్వు కరగడానికి ఎంతసేపు వ్యాయామం చేయాలి? దీనికి సమయ పరిమితి ఉంటుందా?
ఆంధ్రజ్యోతి(15-12-2020)
ఫిటినెస్: ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. అయితే అధిక కొవ్వు కరగడానికి ఎంతసేపు వ్యాయామం చేయాలి? దీనికి సమయ పరిమితి ఉంటుందా?
తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం, ఎక్కువ సమయం పాటు తక్కువ తీవ్రతతో వ్యాయామాలు చేయడం... అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఈ రెండిటిలో ఏ మార్గం ఎంచుకోవాలి అనే అయోమయం కొందరిలో ఉంటుంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలకు బదులుగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంట చొప్పున వ్యాయామాలు చేయడం మేలని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 44 మందిని ఎంపిక చేసి, వారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి బృందం వారంలో ఆరు రోజుల పాటు వ్యాయామం చేస్తే, రెండో బృందం వారంలో రెండు రోజుల పాటు, మూడో బృందం వ్యాయామానికి దూరంగా ఉండేలా చేశారు. చివర్లో వీళ్లందరినీ పరీక్షించినప్పుడు మొదటి గ్రూపు మిగతా రెండు గ్రూపుల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసి, బరువు తగ్గినట్టు తేలింది. కాబట్టి వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజుకు గంట చొప్పున వ్యాయామం చేయడం మేలు. ఇలా వ్యాయామం చేస్తూ, ఆహారపుటలవాట్లను అదుపులో పెట్టుకుంటే అధిక బరువును తేలికగానే తగ్గించుకోవచ్చు.
Updated Date - 2020-12-15T18:57:49+05:30 IST