లంగ్ ఇమ్యూనిటీ!
ABN, First Publish Date - 2020-11-17T17:14:06+05:30
కరోనా నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం అత్యవసరం. ఇందుకోసం ఊపిరితిత్తుల రోగనిరోధకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టాలి. లంగ్ కెపాసిటీని పెంచే కొన్ని నియమాలు పాటించాలి!
ఆంధ్రజ్యోతి(17-11-2020)
కరోనా నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం అత్యవసరం. ఇందుకోసం ఊపిరితిత్తుల రోగనిరోధకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టాలి. లంగ్ కెపాసిటీని పెంచే కొన్ని నియమాలు పాటించాలి!
ప్రాణాయామం: ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలంటే ప్రాణాయామం సాధన చేయాలి. ఒత్తిడికి లోనయినప్పుడు ఆ ప్రభావం శ్వాస మీద పడుతుంది. ఫలితంగా ఊపిరి పీల్చుకుని, వదిలే వేగం పెరిగి ఊపిరితిత్తులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తొలగి శ్వాస వేగం అదుపులో ఉంటుంది.
హానికారక పదార్థాలు: శరీరంలో కఫాన్ని పెంచే పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడిని తగ్గించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్ అయిన ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలి.
కాలుష్యం: లాక్‌డౌన్ తొలగించిన తర్వాత కాలుష్యం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే! అయితే పట్టణాలను వదిలి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి, వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
మాస్క్: వ్యాధికారక సూక్ష్మక్రిములను అడ్డుకోవడంతో పాటు వాతావరణంలో కలిసిన దుమ్ము, ధూళి, పొగలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోకుండా ఉండాలంటే ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన ప్రతిసారీ మాస్క్ ధరిస్తూ ఉండాలి.
Updated Date - 2020-11-17T17:14:06+05:30 IST