ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొడ కండరాల కోసం...

ABN, First Publish Date - 2020-05-06T16:51:28+05:30

శరీరాన్ని మంచి ఆకారంలోకి తేవడం సులువే! కానీ కొన్ని కండరాలు గట్టిపడాలంటే కష్టపడాలి. అలాంటిదే ఈ వ్యాయామం. లోపలి తొడ కండరాలు దృఢంగా మారడానికి, వాటికి ఎంత శ్రమనిచ్చినా పట్టేయకుండా ఉండడానికి ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-05-2020):

శరీరాన్ని మంచి ఆకారంలోకి తేవడం సులువే! కానీ కొన్ని కండరాలు గట్టిపడాలంటే కష్టపడాలి. అలాంటిదే ఈ వ్యాయామం. లోపలి తొడ కండరాలు దృఢంగా మారడానికి, వాటికి ఎంత శ్రమనిచ్చినా పట్టేయకుండా ఉండడానికి ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 


బ్యాలెట్‌ కిక్స్‌: ఎడమ వైపునకు తిరిగి పడుకోండి. ఎడమ మోచేతిని 90 డిగ్రీల కోణంలో వంచి, శరీరం బరువంతా ఆ చేతిపై ఉండేలా చూడండి. తల నేలకు ఆనకూడదు. పది లెక్కపెట్టే వరకు నిదానంగా కుడి కాలిని చిన్న వృత్తాకారంలో తిప్పండి. మోకాళ్లు వంగకూడదు... కుడి పాదం నేలకు తగల కూడదు. అదే విధంగా కుడి వైపునకు తిరిగి, సాధ్యమైనన్నిసార్లు చేయండి. 


స్క్వాట్‌ పల్సెస్‌: కాళ్లు కొద్దిగా దూరం పెట్టి, సుమో స్క్వాట్‌ పొజిషన్‌లో కూర్చోండి. అదే పొజిషన్‌లో ఉంటూ... పదిసార్లు జంప్‌ చేయండి. ఇప్పుడు నిలుచొని కొన్ని క్షణాలు విరామం ఇవ్వండి. మళ్లీ పదిసార్ల చొప్పున... మూడు సెట్లు చేయండి. 


రెయిన్‌బోలా..: అరచేతులు, మోకాళ్లు నేలపై పెట్టండి. చేతులు వంగకుండా, వాటి మధ్య మీ భుజాలంత దూరం ఉండాలి. అలాగే మోకాళ్ల మధ్య కూడా! ఇప్పుడు కుడి కాలిని కుడి వైపునకు చాచి, మొదట పైకి, తరువాత ఎడమ వైపునకు... ఇలా అర్ధచంద్రాకారంలో స్వింగ్‌ చేయండి. తిరిగి ప్రారంభ భంగిమకు వచ్చేయండి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేయండి. ఇలా కనీ సం మూడు సెట్లకు తగ్గకూడదు.

Updated Date - 2020-05-06T16:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising