ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యామ్‌స్ర్టింగ్స్‌కు వ్యాయామం

ABN, First Publish Date - 2020-05-07T16:40:58+05:30

హ్యామ్‌స్ర్టింగ్స్‌కు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా మీ తొడ కండరాలను బలంగా మార్చుకోవచ్చు. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(07-05-2020):

హ్యామ్‌స్ర్టింగ్స్‌కు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా మీ తొడ కండరాలను బలంగా మార్చుకోవచ్చు. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 


క్రాస్‌డ్‌ లెగ్స్‌: నిటారుగా నిలబడి, కుడి పాదాన్ని ఎడమ పాదం మీదుగా అవతల పక్క పెట్టండి. అంటే ఎడమ పాదం కుడి వైపు, కుడి పాదం ఎడమ వైపునకు మారతాయనమాట. మోకాళ్లు వంగకూడదు. నుదుటిని మోకాళ్లకు ఆనించే ప్రయత్నం చేసి, అలా 15 నుంచి 30 సెకన్లు ఉండండి. తరువాత ఎడమ పాదాలు అటూ... ఇటూ మార్చి, ఇదే విధంగా చేయండి. 




టవల్‌తో స్ర్టెచ్‌: చాప మీద వెల్లకిలా పడుకోండి. ఇప్పుడు టవల్‌ను ఈ చిత్రంలో చూపినట్టు కుడి పాదానికి వేసి, రెండు చేతులతో కొనలు పట్టుకోండి. టవల్‌ సాయంతో కుడి కాలిని సాధ్యమైనంత వరకు మీ వైపునకు లాగి, 15 నుంచి 30 సెకన్లు ఉంచండి. మోకాలు వంచకూడదు. అలాగే రెండో కాలిని నేలపై పూర్తిగా ఆనించాలి. ఇదే విధంగా ఎడమ కాలితో చేయండి. 




కూర్చొని..: కుర్చీ అంచుపై కూర్చొని, చేతులు నడుముపై పెట్టండి. కుడి కాలిని పూర్తిగా సాగదీసి, మడమ నేలపై ఆనించి, మునివేళ్లు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. మెడ, నడుము పై భాగం బెండ్‌ చేయకూడదు. నాభి ప్రాంతాన్ని కుడి తొడ వైపు పుష్‌ చేయండి. ఇలా వేరే కాలితో కూడా చేయాలి.


Updated Date - 2020-05-07T16:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising