ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిల్చొని... నిదానంగా..

ABN, First Publish Date - 2020-05-14T14:46:41+05:30

కసరత్తులు అనగానే అతిగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. నిల్చొన్న చోటనే నిదానంగా చేస్తూనే... మంచి ఫిట్‌నెస్‌నిచ్చే వ్యాయామాలూ ఉన్నాయి. నడుము, తొడ కండరాలను పటుత్వంగా ఉంచే సులువైన ఎక్స్‌ర్‌సైజ్‌ ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(14-05-2020):

కసరత్తులు అనగానే అతిగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. నిల్చొన్న చోటనే నిదానంగా చేస్తూనే... మంచి ఫిట్‌నెస్‌నిచ్చే వ్యాయామాలూ ఉన్నాయి. నడుము, తొడ కండరాలను పటుత్వంగా  ఉంచే సులువైన ఎక్స్‌ర్‌సైజ్‌ ఇది. 


నిటారుగా..: మోకాళ్ల కన్నా తక్కువ ఎత్తున్న చిన్న స్టూల్‌ తీసుకోండి. దానికి ఓ అడుగు దూరంలో వెనక్కు తిరిగి, నిటారుగా నిల్చోండి. ఇప్పుడు కుడి పాదాన్ని వెనకనున్న స్టూల్‌పై పెట్టండి. మీ మునివేళ్లు మాత్రమే స్టూల్‌పై ఉండాలి. 


మోకాలు వంచి..: మొదటి పొజిషన్‌లో ఉంటూనే ఎడమ మోకాలిని నేలకు దగ్గరగా వచ్చేలా వంచండి. ఈ పొజిషన్‌లో రెండు మోకాళ్లను దాదాపు 90 డిగ్రీలు వంచాలి.


బ్యాలెన్స్‌..: ఇప్పుడు శరీరం బరువునంతటినీ నేలపైనున్న ఎడమ కాలిపై ఉంచుతూ, మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఎన్ని సార్లు సాధ్యమైతే అన్నిసార్లు ఇలా చేయండి. తరువాత కాళ్లు మార్చి, మళ్లీ ఇదే విధంగా ప్రయత్నించండి.

Updated Date - 2020-05-14T14:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising