ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిండుతో కండరాలకు...

ABN, First Publish Date - 2020-05-21T17:22:16+05:30

కసరత్తులు చేయాలంటే జిమ్‌ పరికరాలే ఉండనక్కర్లేదు. దిండు లేదా బాగా బరువున్న పుస్తకాన్నో ఉపయోగించి కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. అలాంటి వర్కవుటే ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-05-2020):

కసరత్తులు చేయాలంటే జిమ్‌ పరికరాలే ఉండనక్కర్లేదు. దిండు లేదా బాగా బరువున్న పుస్తకాన్నో ఉపయోగించి కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. అలాంటి వర్కవుటే ఇది. 


నడుము పైభాగానికి..: వెల్లకిలా పడుకోండి. కాళ్లను 45 డిగ్రీల కోణంలో మడిచి, పాదాలు పూర్తిగా నేలకు ఆనించండి. దిండు లేదా పుస్తకాన్ని పట్టుకొని, రెండు చేతులనూ పైకి చాచండి. అలాగే నడుము పై భాగాన్ని పైకి లేపుతూ, కూర్చోండి. అంటే ఏ సపోర్టూ లేకుండా లేవాలన్నమాట. ఇప్పుడు కాళ్లను పూర్తిగా దగ్గరకు మడిచి, గదవను మోకాళ్లకు ఆనించే ప్రయత్నం చేయండి. చేతులు నేలకు సమాంతరంగా చాచాలి. మళ్లీ మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇలా నిమిషంలో ఎన్ని సాధ్యమైతే అన్ని చేయండి.


మోకాళ్లకి..: వెల్లకిలా పడుకొని, దిండు/ పుస్తకాన్ని పట్టుకొని, చేతులు పైకి చాచండి. కాళ్లు పూర్తిగా జాపాలి. ఇప్పుడు దిండు/ పుస్తకాన్ని మీ ఛాతీపైకి తీసుకురండి. తరువాత మోకాళ్లను మీ ఛాతీని తాకించి, చేతుల్ని పైకి ఎత్తండి. మళ్లీ మొదటి భంగిమకు వచ్చేయండి. ఇదే విధంగా 15 సెట్లు చేయండి. 


తొడ కండరాలకు..: వెల్లకిలా పడుకొని, పిక్కల మధ్య దిండు/ పుస్తకాన్ని ఉంచండి. అదే పొజిషన్‌లో కాళ్లను పైకి లేపండి. గుర్తుంచుకోండి... దిండు/ పుస్తకం కింద పడకూడదు. అదే సమయంలో తలను కూడా నిదానంగా ఎత్తండి. తిరిగి మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇలా నిమిషంలో చేయగలిగినన్ని సెట్లు చేయండి.

Updated Date - 2020-05-21T17:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising