ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సరిహద్దులో నేపాల్ కాల్పులు

ABN, First Publish Date - 2020-07-20T04:05:20+05:30

బీహార్‌ కిషన్‌గంజ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు ముగ్గురు భారత పౌరులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  బీహార్‌ కిషన్‌గంజ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు ముగ్గురు భారత పౌరులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుడిని వ్యక్తిని 25 ఏళ్ల జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. తప్పిపోయిన తన పశువులను వెతికేందుకు తన ఇద్దరు స్నేహితులు అంకిత్ కుమార్ సింగ్, గుల్షన్ కుమార్ సింగ్‌లతో కలిసి సరిహద్దు సమీపంలోని తోలా మాఫి గ్రామానికి వెళ్లాడు. గ్రామం బయటకు వెళ్లిన వారిపై సరిహద్దులో కాపలా ఉన్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జితేంద్ర కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనను స్థానిక పోలీసులు, సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. నెల రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జూన్ 12 నేపాల్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  

Updated Date - 2020-07-20T04:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising