ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు అమ్మక్యాంటీన్లలో ఉచితంగా ఆహారం

ABN, First Publish Date - 2020-04-24T16:50:56+05:30

కొవిడ్-19 లాక్‌డౌన్ ముగిసే వరకు అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కొవిడ్-19 లాక్‌డౌన్ ముగిసే వరకు అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. మే 3న లాక్‌డౌన్ ఎత్తేసే వరకు నగరంలో దీన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. ‘‘ఇప్పుడు చాలాచోట్ల వైరస్ కంటే ఆకలే అతిపెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది వివిధ పనులు చేస్తున్నప్పటికీ వారికి జీతాలు రావడం లేదు. అందువల్ల నగరంలోని అందరికీ దీన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. ఎవరూ ఆకలితో ఉండడానికి వీల్లేదు...’’ అని కార్పరేషన్‌కి చెందిన ఓ అధికారి వెల్లడించారు.


చెన్నైలో ప్రస్తుతం మొత్తం 407 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం రోజుకు రూ.17 లక్షలు ఖర్చు అవుతోంది. మే 3 వరకు ఉచిత ఆహారం అందించేందుకు సరిపడా విరాళాలు తమకు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఎన్జీవోలు, స్వతంత్ర దాతలు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతల నిధులతో క్యాంటీన్లను నిర్వహిస్తున్నామనీ... ఆసక్తిగల దాతలెవరైనా ఈ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వచ్చునని తెలిపారు. 

Updated Date - 2020-04-24T16:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising