దీన్ దయాళ్, ముఖర్జీలకు బీజేపీ ఘన నివాళి
ABN, First Publish Date - 2020-09-25T16:54:35+05:30
జనసంఘ్ అగ్రనేతలు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామా ప్రసాద్ ముఖర్జీలకు బీజేపీ అగ్రనేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ: జనసంఘ్ అగ్రనేతలు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామా ప్రసాద్ ముఖర్జీలకు బీజేపీ అగ్రనేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రబోధించిన ఏకాత్మ మానవ దర్శనం అందరికీ ఆదర్శమని నేతలు తెలిపారు.
Updated Date - 2020-09-25T16:54:35+05:30 IST