ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబ్రీ కేసులో తీర్పునకు మరింత గడువు

ABN, First Publish Date - 2020-05-09T09:18:25+05:30

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ఆగస్టు 31లోగా తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 8: బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ఆగస్టు 31లోగా తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలోగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్షుల వాంగ్మూలాలను సేకరించడం, ట్రయల్స్‌ సమయంలో దాఖలైన వ్యాజ్యాలను పరిశీలించడం పూర్తిచేయాలని యూపీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కె.యాదవ్‌కు సూచించింది. గత ఏడాది జూలై 19న ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు రెండేళ్ల సమయం కావాలని జస్టిస్‌ యాదవ్‌ సుప్రీంకోర్టును కోరగా.. తొమ్మిది నెలల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు తేలేదాకా జస్టిస్‌ యాదవ్‌కు పదవీ విరమణ ఉండదని అప్పట్లో స్పష్టం చేసింది. సాక్షుల వాంగ్మూలాల సేకరణకు గడువు ఇవ్వాలంటూ జస్టిస్‌ యాదవ్‌ తాజాగా ఈ నెల 6న మరోమారు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎ్‌ఫ.నారిమన్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరో మూడు నెలల గడువు (ఆగస్టు 31లోగా) ఇచ్చింది. 

Updated Date - 2020-05-09T09:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising