ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బంది జీతాలు పెంచిన కెనడా ప్రభుత్వం!

ABN, First Publish Date - 2020-05-10T22:10:10+05:30

ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి కెనడా ప్రభుత్వం బాసటగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టోవా: ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి కెనడా ప్రభుత్వం బాసటగా నిలిచింది. అతి తక్కువ వేతనం పొందుతున్న వైద్య సిబ్బంది జీతాలు తక్షణం పెంచుతున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. తక్కువ జీతాలు పొందుతూ కూడా దేశం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న వారు జీతాలు పెంపునకు కచ్చితంగా అర్హులే అని ఈ సందర్బంగా ట్రూడో వ్యాఖ్యానించారు. నెలకు 1800 డాలర్ల కంటే తక్కువ వేతనం పొందుతున్న వైద్య సిబ్బంది అందరికీ ఈ పెంపు వర్తించనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా 3 బిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. దీనికి కెనడాలోని అన్ని ప్రావిన్స్‌లు(రాష్ట్రాలు) అంగీకరించాయన్నారు. కాగా.. కరోనా దెబ్బకు అల్లాడుతున్న కెనడాలో 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించగా మొత్తం కరోనా కేసులు 64 వేలకు చేరువవుతున్నాయి. కరోనా కారణంగా.. అక్కడి ప్రావిన్స్‌లన్నిటికీలోకి క్యూబెక్ అత్యధికంగా ప్రభావితమైంది.

Updated Date - 2020-05-10T22:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising