ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి బెంగాల్‌కు కేంద్ర బృందాలు

ABN, First Publish Date - 2020-06-04T16:52:06+05:30

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజు శర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కేంద్ర బృందాలు మరోసారి బెంగాల్‌లో పర్యటించనున్నాయి. అయితే ఈసారి కోవిడ్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కాదు... ఆంఫన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి ఈ బృందం వెళ్లనుంది. వీరందర్నీ ‘రాష్ట్ర అతిథులుగా’ మమత సర్కార్ అభివర్ణించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజు శర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించింది.


రోడ్లు భవనాలు, జలశక్తి, విద్యుత్ శాఖ, మత్స్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. రెండ్రోజుల పాటు బెంగాల్‌లో ఈ బృందం పర్యటిస్తుండగా... వీరి పర్యటన గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆంఫన్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.


ఇప్పటికే ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల సాయాన్ని కూడా ప్రకటించారు. బెంగాల్‌కు తక్షణ సహాయంగా వెయ్యి కోట్లను కూడా మోదీ ప్రకటించారు. 

Updated Date - 2020-06-04T16:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising