ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరం పాటించనందుకు.. సురేశ్‌ రైనా అరెస్టు

ABN, First Publish Date - 2020-12-23T09:14:38+05:30

కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రికెటర్‌ సురేశ్‌ రైనా, గాయకుడు గురు రంధావా, బాలీవుడ్‌ సెలిబ్రిటీ సుసానే ఖాన్‌లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటి రకుల్‌ ప్రీత్‌కు కరోనా పాజిటివ్‌


ముంబై, డిసెంబరు 22 : కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రికెటర్‌ సురేశ్‌ రైనా, గాయకుడు గురు రంధావా, బాలీవుడ్‌ సెలిబ్రిటీ సుసానే ఖాన్‌లను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌లో దాడి జరిపి, డిన్నర్‌ పార్టీలో పాల్గొన్న మొత్తం 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సురేశ్‌ రైనా, గురు రంధావా, సుసానే ఖాన్‌ సహా పలువురు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే రైనా, రంధావా వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. వాటి ప్రకారం నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలి. అయితే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా క్లబ్‌ను తెరిచి ఉంచినందుకు నిర్వాహకులపై, కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆ డిన్నర్‌లో పాల్గొన్న వారిపై ఐపీసీ 188, 269, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


  భౌతిక దూరానికి సంబంధించిన నియమాలను కూడా ఈ డిన్నర్‌లో పాల్గొన్నవారు పాటించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే సురేశ్‌ రైనా ఉద్దేశపూర్వకంగా కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఆయన మేనేజ్‌మెంట్‌ టీం స్పష్టంచేసింది. ‘‘షూటింగ్‌ కోసం సురేశ్‌ ముంబైకి వచ్చారు. అది కొంత ఆలస్యమవుతుందని తెలియడంతో ఒక మిత్రుడు ఆయనను డిన్నర్‌కు పిలిచారు. స్థానిక కొవిడ్‌ నిబంధనలు, రాత్రి కర్ఫ్యూ గురించి తెలియకపోవడంతో క్లబ్‌కు రైనా వెళా ్లరు. ఇది చాలా దురదృష్టకర ఘటన’’ అని తెలిపింది. 


కొత్త కొవిడ్‌ కేసులు 19,556 ..

ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు మంగళవారం కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. డిసెంబరు 11న హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘మే డే’ చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు.  కాగా కొవిడ్‌ నిబంధనలు తనకు వర్తించవు అనేలా మహారాష్ట్రలోని మల్షిరాస్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాం సత్పుతే పెళ్లి చేసుకున్నారు. 50 మందే పెళ్లికి హాజరుకావాలని నిబంధనలు చెబుతుండగా, వేలాది సంఖ్యలో ఈ వేడుకకు తరలి వచ్చారు. దీనికి హాజరైన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, మాజీ సీఎం ఫడణవీస్‌, ఎంతోమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాస్క్‌ను ధరించలేదు.


భౌతికదూరం పాటించనేలేదు. ఇక దేశంలో ఒకరోజు వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య ఆరు నెలల కనిష్ఠానికి తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో 20వేల కంటే తక్కువే పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నిర్ధారణ అయిన 19,556 కొత్త ‘పాజిటివ్‌’లను కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య కోటి (1,00,75,116) దాటింది. 

Updated Date - 2020-12-23T09:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising