ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోఎయిర్ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు

ABN, First Publish Date - 2020-03-18T15:50:49+05:30

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గో ఎయిర్ విమానయాన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గో ఎయిర్ విమానయాన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా తమ గో ఎయిర్ అంతర్జాతీయ విమాన సర్వీసులను ఏప్రిల్ 15వతేదీ వరకు రద్దు చేసింది. విదేశాల నుంచి ప్రయాణికులు మన దేశంలోకి రాకుండా నిషేధం విధించిన దృష్ట్యా తమ గోఎయిర్ అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గోఎయిర్ ప్రకటించింది.


ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రోషియా, సిప్రస్, సీజెచ్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథూనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, ఐస్ లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, టర్కీ, యూకే దేశాల నుంచి రాకపోకలు సాగించే గో ఎయిర్ విమాన సర్వీసులను ఏప్రిల్ 15వతేదీ వరకు రద్దు చేశామని ఆ సంస్థ ప్రకటించింది. కేంద్రప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో విదేశీయుల రాకపై నిషేధం విధించిన నేపథ్యంలో విమానసర్వీసులను రద్దు చేశామని గోఎయిర్ ప్రకటించింది. 

Updated Date - 2020-03-18T15:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising