ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్‌లో క‌రోనా క‌మ్యూనిటీ స్ప్రెడ్ షురూ : ఐఎంఏ

ABN, First Publish Date - 2020-07-19T14:02:11+05:30

భారత్‌లో క‌రోనా అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 34 వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య 10 లక్షలు 38 వేల 715 దాటింది. భారతదేశంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో క‌రోనా అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 34 వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య 10 లక్షలు 38 వేల 715 దాటింది. భారతదేశంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని, పరిస్థితి మరింత దిగజారిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ వి కె మోంగా మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిపారు. భారతదేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ మోంగా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందుతున్న‌ద‌ని అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు మ‌రింత‌గా స‌న్న‌ద్ధ‌మ‌వ్వాల‌ని అన్నారు. కాగా అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా రోగులు అధిక‌సంఖ్య‌లో భారతదేశంలోనే ఉన్నారు.  

Updated Date - 2020-07-19T14:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising