ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులపై చైనా హ్యాకర్ల సైబర్‌ దాడులు

ABN, First Publish Date - 2020-12-20T08:54:59+05:30

పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట భారీగా ఆఫర్లు పెడుతుంటాయి. అదే సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 19: పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట భారీగా ఆఫర్లు పెడుతుంటాయి. అదే సమయంలో వాట్సా్‌పలలో ఒక సందేశం చక్కర్లు కొడుతుంటుంది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’ లేదా ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ పేరుతో ఒక లింక్‌ వస్తుంది. అది క్లిక్‌ చేస్తే చక్రం తిరుగుతున్న పేజీ ఒకటి తెరుచుకుంటుంది. ఆ చక్రం ఒప్పో ఎఫ్‌ 17ప్రో వద్ద ఆగుతుంది. దీంతో.. ఆ ఫోన్‌ మీకు ఫ్రీగా పంపిస్తున్నాం అని అందులో ఒక సందేశం కనిపిస్తుంది. కానీ అది చైనా హ్యాకర్ల పని అని తేల్చి చెబుతోంది సైబర్‌ పీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ. లక్షలాదిమంది భారతీయుల వివరాలే లక్ష్యంగా చైనాకు చెందిన హ్యాకర్లు ఈ కుంభకోణానికి తెర లేపారంటూ ఒక నివేదిక విడుదల చేసింది. ‘‘చైనాలోని గువాంగ్‌డాండ్‌, హెనన్‌ ప్రావిన్సుల నుంచి హ్యాకర్లు సైబర్‌ దాడులు కొనసాగించారు.


ఫాండ్‌ షావో కింగ్‌ అనే సంస్థ నుంచి ఈ హ్యాకింగ్‌ జరిగింది. అలీబాబా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వేదికపై తమ డొమైన్లను హ్యాకర్లు నమోదు చేసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఆఫర్లంటూ నకిలీ లింకుల్ని సృష్టించి హ్యాకర్లు నెటిజన్లను ఆకర్షించారు. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’, ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ వంటివన్నీ ఈ హ్యాకింగ్‌ కుంభకోణంలో భాగమే. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని సైబర్‌పీస్‌ నివేదికలో పేర్కొంది.

Updated Date - 2020-12-20T08:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising