ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో జూలో మృతి చెందిన ఆడపులి.. కరోనా టెస్టుకు శాంపిల్

ABN, First Publish Date - 2020-04-24T23:12:08+05:30

ఢిల్లీ జూలో బుధవారం ఓ ఆడపులి కిడ్నీలు పాడై ప్రాణాలు కోల్పోయింది. ఈ పులి శాంపిళ్లను సేకరించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ జూలో బుధవారం ఓ ఆడపులి కిడ్నీలు పాడై ప్రాణాలు కోల్పోయింది. ఈ పులి శాంపిళ్లను సేకరించిన అధికారులు వాటిని కరోనా పరీక్షలకు పంపారు. 14 ఏళ్ల ఈ ఆడపులి కల్పన బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయిందని, గురువారం దానిని దహనం చేసినట్టు పర్యావరణ మంత్రి తెలిపారు. పులి బాగా బలహీనమైందని, దానిలో క్రియేటిన్ స్థాయులు పెరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. 


కరోనా వైరస్ నేపథ్యంలో పులి కళేబరాన్ని అతికొద్ది మంది అధికారుల సమక్షంలో దహనం చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. దాని శాంపిళ్లను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు పేర్కొన్నారు. 


అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగానే పులి మరణించిందని సెంట్రల్ జూ అథారిటీ మాజీ కార్యదర్శి డీఎన్ సింగ్ ఆరోపించారు.  అది డీహైడ్రేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. పులి కళేబరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఒక్క సీనియర్ అధికారి కూడా లేరని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-24T23:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising