మోదీ మాటతో పాక్‌లోనూ వెలిగిన దీపాలు!
ABN, First Publish Date - 2020-04-06T04:21:19+05:30
ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఇస్లామాబాద్: ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం రాత్రి సరిగ్గా 9గంటలకు భారత దేశం మొత్తం దీపకాంతులతో వెలిగిపోయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌లోని ఇండియన్ హైకమిషన్‌లో కూడా అధికారులు దీప ప్రజ్వలన చేశారు. ఆఫీసు భవనంలోని లైట్లన్నీ ఆపేసి, దీపాలు వెలిగించి కరోనాపై పోరుకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. మోదీ మాటతో పాకిస్తాన్‌లో కూడా దీపాలు వెలిగాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2020-04-06T04:21:19+05:30 IST