ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బంది రాకపోకలకు అడ్డంకులు ఏర్పడొద్దు: కేంద్రం

ABN, First Publish Date - 2020-05-11T21:54:30+05:30

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు వైద్యసేవల్లో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం రాష్ట్రాలకు ముఖ్య సూచనలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు వైద్యసేవల్లో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం రాష్ట్రాలకు ముఖ్య సూచనలు చేసింది. దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు క్లీనిక్‌లు, నర్సింగ్‌ హోంలు, ల్యాబ్‌లు తెరిచి ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిలోని సిబ్బందికి విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పింది.


ఇక భారత్‌లో ఆదివారం ఒక్కరోజే ఏకంగా 4,200 కరోనా కేసులు వెలుగు చూడటం సంచలనానికి దారితీసింది. సడలింపులు అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రధాని-ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 

Updated Date - 2020-05-11T21:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising