ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీజీ కళ్లజోడు ః 2.5 కోట్లు

ABN, First Publish Date - 2020-08-24T09:35:30+05:30

మహాత్మా గాంధీ ధరించిన దిగా భావిస్తున్న ఓ కళ్లజోడు లండన్‌లో జరిపిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలంలో కొనుగోలు చేసిన అమెరికా వ్యక్తి


లండన్‌, ఆగస్టు 23: మహాత్మా గాంధీ ధరించిన దిగా భావిస్తున్న ఓ కళ్లజోడు లండన్‌లో జరిపిన వేలంలో రికార్డు స్థాయిలో రూ.2.5 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంగ్లండ్‌లోని ‘ఈస్ట్‌ బ్రిస్టల్‌ ఆక్షన్స్‌’ అనే సంస్థ ఈ ఆన్‌లైన్‌ వేలాన్ని నిర్వహించింది. బంగారు పూత పూసిన ఈ కళ్లజోడును తమకు ఓ వ్యక్తి తెచ్చి ఇచ్చారని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆ కళ్లజోడు కొన్ని దశాబ్దాలుగా తమ ఇంట్లో ఉంటుందని ఆయన చెప్పారని వివరించారు.


1910- 1930 మధ్య దక్షిణాఫ్రికాలో పనిచేసిన తన బంధువు ఒకరు అక్కడ గాంధీజీని కలిశారని ఆ వ్యక్తి చెప్పారని తెలిపారు. దీంతో ఆ కళ్లజోడు, ఆయన చెప్పిన తే దీలు, వివరాలు అన్ని పరిశీలించి చూశామని, అప్పట్లో గాంధీజీ ఈ కళ్లజోడు ధరించినట్లు తెలిసిందని వివరించారు. ఇది గాంధీజి మొదటి కళ్లజోళ్లలో ఒకటి అయి ఉండొచ్చని, ఆయనకు తన వస్తువులను ఇతరులకు ఇచ్చే అలవాటు కూడా ఉందని చెప్పా రు. ఈ కళ్లజోడు ధర మొదట 14.7 లక్షలుగా నిర్ణయించామని, అయితే, డిమాండ్‌ పెరగడంతో చివరకు రూ.2.5 కోట్లకు అమ్ముడుపోయిందని చెప్పారు. దీన్ని అమెరికా వ్యక్తి ఒకరు కొనుగోలు చేశారని వివరించారు.

Updated Date - 2020-08-24T09:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising