ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలులో వ‌చ్చిన ఏడుగురికి క‌రోనా పాజిటివ్‌... గోవాలో పెరుగుతున్న క‌రోనా కేసులు!

ABN, First Publish Date - 2020-05-18T15:29:47+05:30

దేశంలో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. అయితే కరోనా కేసులు అంత‌గా న‌మోదు‌కాని గోవాలో కొత్త కేసులు చోటుచేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: దేశంలో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. అయితే కరోనా కేసులు అంత‌గా న‌మోదు‌కాని గోవాలో కొత్త కేసులు చోటుచేసుకున్నాయి. ముంబై నుంచి రైలులో గోవాకు వచ్చిన ఏడుగురు ప్ర‌యాణికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోవాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 మార్కును దాటింది. ముంబై నుంచి గోవాకు రైలులో వచ్చిన సుమారు 100 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం దేశంలోని పదిహేను నగరాలకు ఢిల్లీ నుంచి రైళ్లు న‌డుస్తున్నాయి. గోవా ప్రభుత్వం ఇటీవ‌లే త‌మ రాష్ట్రాన్ని కరోనా రహితంగా ప్రకటించింది. తాజాగా కేసులు న‌మోదు కావ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. 

Updated Date - 2020-05-18T15:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising