ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియాజ్ హతమవడంతో సైఫుల్లాకు హిజ్బుల్ బాధ్యతలు

ABN, First Publish Date - 2020-05-08T17:34:52+05:30

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూను భద్రతా బలగాలు హతమార్చడంతో సైఫుల్లా కొత్త కమాండర్‌ అయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూను భద్రతా బలగాలు హతమార్చడంతో సైఫుల్లా కొత్త కమాండర్‌ అయ్యాడు. సైఫుల్లాకు హిజ్బుల్ బాధ్యతలు అప్పగించారనే సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అతడి వేట మొదలుపెట్టాయి. ఇంతకాలం దక్షిణ కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్న సైఫుల్లా ఏ ప్లస్ ప్లస్ కేటగిరి ఉగ్రవాది. కరడుగట్టిన ఉగ్రవాదిగా పేరున్న సైఫుల్లాకు భద్రతా బలగాల కాల్పుల్లో గాయపడే ఉగ్రవాదులకు చికిత్స అందేలా చూసే బాధ్యత ఉంది. 


మే ఆరున రియాజ్ తన సొంతూరైన బేగ్‌పొరాకు వెళ్లి భద్రతా బలగాలకు చిక్కి హతమయ్యాడు. ఏ ప్లస్ ప్లస్ కేటగిరిలో ఉన్న రియాజ్‌ తలపై 12 లక్షల రివార్డ్ కూడా ఉంది. రియాజ్ మరణంతో షాక్‌ తిన్న హిజ్బుల్ తమ కొత్త కమాండర్‌ ఎంపికపై గట్టిగా కసరత్తు చేసింది. చివరకు సైఫుల్లాకు బాధ్యతలప్పగించారు. 


జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు పోలీసులతో కలిసి గత నాలుగు నెలల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. 

Updated Date - 2020-05-08T17:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising