ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను డొనాల్డ్ ట్రంప్‌ను కాను : సీఎం ఉద్ధవ్

ABN, First Publish Date - 2020-07-22T21:12:23+05:30

మహారాష్ట్రలో కరోనా విజృంభణ... ప్రజలు పడుతున్న కష్టాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభణ... ప్రజలు పడుతున్న కష్టాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. తానేమీ డొనాల్డ్ ట్రంప్‌ను కానని, తన కళ్లముందు మహారాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉండలేనని స్పష్టం చేశారు. శివసేన అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను సామ్నా ఎడిటర్, పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ నిర్వహించారు.


అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఏ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారో పూర్తిగా తెలియదు కానీ... సంజయ్ రౌత్ మాట్లాడుతూ... మహారాష్ట్రలో ‘వడపావ్’ బాగా ప్రసిద్ధి అని, ముంబై వీధుల్లో విరివిగా అందుబాటులో ఉంటుందని, దీనిపై ఆంక్షలు పెడితే మాత్రం ప్రజలు చికాకుపడతారని రౌత్ పేర్కొన్నపడు సీఎం ఉద్ధవ్ పై విధంగా వ్యాఖ్యానించారు.


ఇప్పటికీ లాక్‌డౌన్ కొనసాగుతోందని.. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా నిబంధనలు మాత్రం సడలించామని, దీనిని గమనంలోకి తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. పరీక్షలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో కూడా కూలంకషంగా వివరించారు. విద్యార్థులు కరోనా బారిన పడకూడదనే అందరూ భావిస్తున్నారని, ఒకవేళ ఏదైనా నిర్ణయానికి కమిట్ అయినపుడు మాత్రం... ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం ఉద్ధవ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-22T21:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising