ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్, యూరోపియన్ యూనియన్ సహజ భాగస్వాములు : మోదీ

ABN, First Publish Date - 2020-07-15T23:19:21+05:30

భారత దేశం, యూరోపియన్ యూనియన్ సహజ భాగస్వాములని ప్రధాన మంత్రి నరేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశం, యూరోపియన్ యూనియన్ సహజ భాగస్వాములని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం చర్యలకు పెద్ద పీట వేసే ఎజెండాను రూపొందించాలన్నారు. 


15వ ఇండో-ఈయూ సదస్సును ఉద్దేశించి బుధవారం మోదీ మాట్లాడారు. భారత దేశం, యూరోపియన్ యూనియన్ సహజ భాగస్వాములని, ప్రపంచంలో శాంతి, సుస్థిరతలకు ఈ బంధం దోహదపడుతుందని అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం చర్యలకు పెద్ద పీట వేసే ఎజెండాను రూపొందించాలన్నారు. గాఢమైన, సమగ్రమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 


బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించవలసి ఉందన్నారు. నిర్దిష్ట సమయంలో అమలు చేయగలిగే ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చారు. 


కోవిడ్-19 కారణంగా భారత దేశం, యూరోపియన్ యూనియన్ సదస్సును వాయిదా వేయవలసి వచ్చిందని చెప్పారు. వర్చువల్ సమావేశం ద్వారా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 


ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లెయెన్ పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-15T23:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising