ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో చిక్కుకున్న ఇండియన్ సెయిలర్స్... క్వారంటైన్ కోసమేనంటున్న చైనా...

ABN, First Publish Date - 2020-12-25T23:13:38+05:30

చైనాలోని రెండు నౌకాశ్రయాలకు చేరిన రెండు భారతీయ నౌకలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనాలోని రెండు నౌకాశ్రయాలకు చేరిన రెండు భారతీయ నౌకలపై అనుమానాస్పద ఆంక్షలు అమలవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు నౌకల తర్వాత వచ్చిన నౌకల నుంచి సరుకును దింపడానికి, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ, మన దేశ నౌకల నుంచి కార్గోను దింపడానికి, వాటిలోని సిబ్బందిని కనీసం క్రిందకు దిగడానికి అనుమతించకపోవడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనతో ఈ పరిణామాలకు సంబంధం లేదని, కేవలం కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తున్నామని చైనా చెప్తోంది. 


ఎంవీ జాగ్ ఆనంద్, ఎంవీ అనస్టేసియా నౌకలు చైనాలోని జింగ్టాంగ్, కెవోఫెయిడియన్ నౌకాశ్రయాలకు వెళ్ళాయి. ఆస్ట్రేలియన్ కోల్‌ను తీసుకెళ్ళిన ఈ నౌకలు కొద్ది నెలల నుంచి ఇక్కడే ఉండిపోయాయి. వీటిలో 39 మంది ఇండియన్ సీఫేరర్స్‌ ఉన్నారు. వీరు కనీసం ఈ నౌకల నుంచి దిగడానికి, సరుకును దించడానికి సైతం చైనా అధికారులు అనుమతించడం లేదు. దీంతో సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరోవైపు ఈ నౌకలలో మందుల నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో వీరు భారత ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. 


ఈ పరిస్థితులపై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చైనా అధికారులను ప్రశ్నించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ, మన దేశ నౌకల తర్వాత చేరుకున్న ఇతర నౌకలు కార్గోను దించేసి, తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసిందన్నారు. మన దేశ నౌకలకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదన్నారు. 


ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను శుక్రవారం మీడియా ప్రశ్నించింది. భారత దేశం, చైనా, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగానే భారత దేశ నౌకలకు అనుమతి ఇవ్వలేదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు వాంగ్ వెన్‌బిన్ సమాధానం చెప్తూ, క్వారంటైన్ చర్యలపై చైనాకు స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు పదే పదే చెప్తున్నామన్నారు. ప్రస్తుతం నౌకలకు సంబంధించిన అంశంపై భారత దేశంతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. భారత్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామన్నారు. క్వారంటైన్ నిబంధనలను పాటిస్తే సిబ్బంది మార్పుకు చైనా అనుమతిస్తుందన్నారు. అయితే జాగ్ ఆనంద్ నౌక జింగ్టాంగ్ నౌకాశ్రయంలో నిలిచిపోగా, ఈ నౌకాశ్రయం క్రూ ఛేంజెస్ జాబితాలో లేదన్నారు. ద్వైపాక్షిక సంబంధాలతో దీనికి ఏదైనా సంబంధం ఉందా అంటే, అలాంటి సంబంధం ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. 


జాగ్ ఆనంద్ నౌక జూన్ 13 నుంచి జింగ్టాంగ్ నౌకాశ్రయంలో చిక్కుకుంది. దీనిలో 23 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. కెవోఫెయిడియన్ నౌకాశ్రయంలో ఎంవీ అనస్టేసియా నౌక సెప్టెంబరు 20 నుంచి నిలిచిపోయింది. దీనిలో 16 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ రెండు నౌకల నుంచి సరుకును దించవలసి ఉంది. 


Updated Date - 2020-12-25T23:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising